
సారాంశం




గర్భం దాల్చిన స్త్రీలు రొయ్యలను తినడం ఆరోగ్యకరమే. అయితే అవి వండి తింటే మంచిది. కానీ, పచ్చి రొయ్యలు, పచ్చి గుల్లలు లాంటివి ఉంటే.. మెనూ నుంచి ప్రత్యామ్నాయ పదార్థాలను ఎంచుకోవాలి. రా షెల్‌ఫిష్‌లో ఆరోగ్యానికి హాని కలిగించే బాక్టీరియా ఉంటుంది. ఇది ఆహారం విషతుల్యం చేసే అవకాశం ఉంది. సాధారణంగా గర్భం దాల్చిన స్త్రీలు వాళ్ల ప్రెగ్నెన్సీ కాలంలో జరిగే శరీర మార్పుల కారణంగా ఫుడ్ పాయిజన్‌కు గురవుతూ ఉంటారు. ఈ ఫుడ్ పాయిజన్ వల్ల అకాల జననాలు, ఇన్ఫెక్షన్ల పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి గర్భవతులు తమని తాము రొయ్యలు తినాలా వద్దా అనే అంశాన్ని ప్రశ్నించుకోవాలి. అదే విధంగా రొయ్యలు తినడం వల్ల జరిగే లాభనష్టాలను బేరీజు వేసుకోవాలి.
రొయ్యలు మంచి రుచికరమైన ఆహారం మాత్రమే కాదు, తల్లి కాబోతున్న స్త్రీలకు కావాల్సిన ఎన్నో రకాల విటమిన్లు, ప్రోటీన్లు కలిగి ఉంటాయి. మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో రొయ్యలు తినడం వల్ల లభించే కొన్ని ప్రయోజనాలను తెలుసుకోండి.
గర్భవతులుగా ఉన్న స్త్రీలు రొయ్యలు తినొచ్చా? అంటే అది గర్భం దాల్చిన మహిళ ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ గర్భవతి అయిన స్త్రీకి రొయ్యలు తినడం వల్ల ఎటువంటి అలర్జీలు రానట్లయితే నిస్సందేహంగా రొయ్యలను గర్భవతిగా ఉన్న సమయంలో తినవచ్చు. రొయ్యలు గర్భవతులకు కావలసిన ఎన్నో విలువైన ప్రోటీన్లు కలిగి ఉంటుంది. సహజంగా ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినడం వల్ల రక్తంలోని చక్కర స్థాయి నియంత్రణలో ఉంచుతుంది. అలాగే స్త్రీలలో ఏర్పడే గర్భాధారణ మధుమేహాన్ని నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. తక్కువ కేలరీలు ఉంటాయి కాబట్టి కండరాల పుష్టిని పెంపోదించడంలో దోహదపడుతుంది.
మానవ శరీరానికి అవసరమయ్యే ఇతర పోషకాలు రొయ్యలలో అధికంగా లభిస్తాయి. అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్ సెలీనియం వంటి పోషకాలు మానవుల కణజాల నష్టాన్ని నివారిస్తాయి. కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షించే పోషకాలు రొయ్యలలో ఎక్కువగా ఉంటాయి. ఇవి తినడం వల్ల వచ్చే పోషకాలను శరీరం సులభంగా గ్రహిస్తుంది. మహిళలు వారు గర్భవతులైన సమయంలో కూడా రొయ్యలు తినవచ్చు. మానవ శరీరంలో కొత్త కణాల ఉత్పత్తికి, పాడైన కణాలను బాగు చేయడానికి అవసరమయ్యే అమైనో ఆమ్లాలు ఉంటాయి. అస్టాక్సంతిన్‌లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఏజింగ్ లక్షణాలు వంటివి ఉంటాయి. ఇవన్నీ రొయ్యల్లో లభిస్తాయి.
ఇక రొయ్యలు ఒమేగా 3 లాంటి విలువైన పోషకాలు ఉంటాయి. ఒమేగా 3 గర్భస్థ శిశువు యొక్క నరాల అనుసంధానం, కళ్ల ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది.
గర్భవతులు ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండడం పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. గర్భవతులు రొయ్యలు తినడం వల్ల చెడు కొవ్వు పదార్థాలను తీసుకోకుండా శరీరానికి అవసరమయ్యే న్యూట్రిషన్లు అధికంగా లభిస్తాయి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో చేపలు: ప్రయోజనాలు మరియు రిస్కులు
గర్భవతులైన స్త్రీలు కొన్ని రకాలైన సీ ఫుడ్స్‌కు దూరంగా ఉండడం మంచిది. కలుషితం లేని పరిసరాలలో లభించే రొయ్యలను బాగా ఉడికించి తినడం మంచిదే. ఏది ఏమైనా గర్భవతులైన స్త్రీలు ఆహారపు అలవాటులో కొన్ని మితంగా చేర్చుకోవడం శ్రేయస్కరం. గర్భవతులు రొయ్యలనే కాదు ఏ ఇతర ఆహార పదార్థాలను తీసుకునే విషయంలో అయినా కొన్ని నియంత్రణలు పాటించాలి. గర్భవతులు రొయ్యలు తినే అంశంపై ఏదైనా సందేహం ఉంటే వైద్యుల్ని సంప్రదించాలి.
గర్భవతులు రొయ్యలు తినడం వల్ల కొన్ని అలర్జీలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. గర్భవతిగా ఉన్నప్పుడు రొయ్యలు తినడం వల్ల వచ్చే రిస్కుల గురించి కింద వివరించాం.
ఒకవేళ గర్భం ధరించిన మహిళలకు అధికంగా కొలెస్ట్రాల్ ఉన్నట్టయితే తనకు పుట్టబోయే శిశువు ఆరోగ్యానికి రొయ్యలు తినడం శ్రేయస్కరం కాదు. ఎందుకంటే రొయ్యల్లో అధికంగా కొలెస్ట్రాల్ ఉంటుంది.
రొయ్యలు తినడం వల్ల అలర్జీలు ఏమైనా వస్తున్నాయి అనుకుంటే వాటిని తినకపోవడమే మంచిది. ఒకవేళ తిన్నట్లయితే కడుపులో నొప్పి, దురదలు, వాపులకు కారణం అవుతాయి.
కలుషితమైన నీటి నుంచి తీసుకునే రొయ్యలలో విషపూరితమైన రసాయనాలు ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయి. పీతలు, రొయ్యలు నీటిలోని కలుషితాలను గ్రహించే అవకాశం ఉంది. ఇలాంటి రొయ్యలు తినడం వల్ల స్త్రీల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఉప్పునీటిలో లభించే రొయ్యలలో పాదరసం ఎక్కువగా ఉంటుంది. ఇది తినడం వల్ల గర్భస్థ శిశువు యొక్క నాడీ వ్యవస్థ దెబ్బ తినే అవకాశం ఉంది. కలుషితమైన నది నీటిలో ఎక్కువగా క్లోరినేటెడ్ బైఫినైల్స్ కలిగి ఉంటాయి. వీటిలో లభించే రొయ్యలను తినడం వల్ల గర్భం దాల్చిన స్త్రీలతో పాటు, శిశువు ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
గర్భం దాల్చిన స్త్రీలు బాగా ఉడికించిన రొయ్యలను తినడం శ్రేయస్కరం. ఒకవేళ ఉడకని, పచ్చి రొయ్యలను తినే అలవాటు ఉన్నట్లయితే అవి గర్భవతులకు ఇన్ఫెక్షన్లు కలిగించే అవకాశం ఉంది. ఫుడ్ పాయిజనింగ్, బ్లడ్ పాయిజనింగ్ లాంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు.
అదృష్టవశాత్తు గర్భవతులు రొయ్యలు తినడం ఒక రకంగా మంచిదే. కానీ స్క్విడ్, స్కాలోప్స్ మరియు స్కాంపి లాంటి షెల్‌ఫిష్ తీసుకోకూడదు. పచ్చి షెల్‌ఫిష్‌లో చెడు బ్యాక్టీరియా, వైరస్ కలిగి ఉంటుంది. ఆహారం వల్ల వచ్చే వ్యాధులకు దారితీయవచ్చు. అందుకే కాబట్టి గర్భవతులు ఈ ఆహారపు అలవాటుకి దూరంగా ఉండటం మంచిది.
గర్భవతుల్లో జీవక్రియ, రక్తప్రసరణలో మార్పులు ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీయవచ్చు. కాబట్టి ఆహారపు అలవాట్లు నియంత్రణలో ఉంచుకోవడం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం మంచిది. పచ్చి రొయ్యల వంటి కొన్ని వండని ఆహారాలు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించడం శ్రేయస్కరం.
గర్భధారణ సమయంలో షెల్‌ఫిష్ తినడం వల్ల చెడు ప్రభావాలు ఉంటాయి. కానీ రొయ్యలను మితంగా తీసుకోవడం మంచిదే. బాగా ఉడకని రొయ్యలు తినడం వల్ల స్త్రీ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏది ఏమైనా గర్భవతులు రొయ్యలు తినే అంశంపై వైద్యులను సంప్రదించి వారి సూచనలను అనుసరించి తినడం మంచిది.
Tags
Prawns During Pregnancy in English, Prawns During Pregnancy in Hindi, Prawns During Pregnancy in Bengali, Prawns During Pregnancy in Tamil
ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు సరైన ప్రెగ్నెన్సీ సప్లిమెంట్లు మీకు, మీ బిడ్డకు అవసరమైన పోషకాలను నిండుగా అందిస్తాయి.

Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Fades Stretch Marks | Improves Digestion | Reduces Stress




MamaGro™ Protein Diskettes - High Protein & No Added Sugar - 250gm (50 Diskettes)
High Protein Pregnancy Biscuits | Supports Healthy Placenta | Supports Fetal Development | Easy To Digest




Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each




Compression Stocking Socks - S
Compression Stockings for Varicose Veins | Reduces Swelling | Boosts Blood Circulation



This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |